Friday, October 29, 2010

అరటి కాయ ఉప్మా కూర


కావాల్సిన పదార్థాలు:

అరటి కాయలు _ 3
పచ్చిమిరప కాయలు _ 2 - 4
అల్లం _ ఒక చిన్న ముక్క
ఉప్పు _ తగినంత
పసుపు _ చిటికెడు
నిమ్మకాయ _ 1
శనగపప్పు _ తాలింపుకు సరిపడినంత
మినపప్పు _ తాలింపుకు సరిపడినంత
ఆవాలు _ తాలింపుకు సరిపడినంత
జీలకర్ర _ తాలింపుకు సరిపడినంత
కరివేపాకు _ రెండు రెబ్బలు

ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కొంచం ఉప్పు, మజ్జిగ వేయాలి. అరటి కాయలు ముక్కలుగా  మరీ చిన్నవి కాకుండా నీళ్ళల్లోకి తరిగి పెట్టు కోవాలి. బాండీ లో నూనె పోసి శనగ పప్పు, మిన పప్పు, ఆవాలు, జీలక ర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. తరుగుకున్న అరటి కాయలు వేసి, నీళ్ళు కొంచం కూరలో చిలకరించి, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. కూర అడుగు అంట కుండా మూత మీద నీరు పోసి పెట్టాలి. కొంత సేపు తర్వాత అల్లం, పచ్చిమిరప కాయలు పేస్ట్ చేసి కూరలో వేయాలి. కూర మగ్గి, ముక్క మెత్త బడ్డాక నిమ్మకాయ పిండి కూర దించాలి. ఇలాగే బంగాళ దుంప కూర వుల్లిపాయలు వేసి/ వేయకుండా చేయవచ్చు.